తాప్సీ సినిమాకు ఊహించని చిక్కులు
BoycottDobaara, why are twitterati so angry. బాలీవుడ్ లో పలు సినిమాలను ప్రజలు బాయ్ కాట్ చేస్తున్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat
బాలీవుడ్ లో పలు సినిమాలను ప్రజలు బాయ్ కాట్ చేస్తున్న సంగతి తెలిసిందే..! కొన్ని వారాల క్రితం #BoycottLaalSinghChadda ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయింది. హాలీవుడ్ హిట్ చిత్రం 'ఫారెస్ట్ గంప్'కి అధికారిక రీమేక్ అయిన లాల్ సింగ్ చద్దాపై ద్వేషపూరిత ప్రచారం సాగింది. అంతేకాకుండా అనేక కోణాలలో ఈ సినిమాపై నెగటివ్ గా ప్రచారం చేశారు. కరీనా కపూర్ ఖాన్ చేసిన పాత స్టేట్‌మెంట్‌పై విమర్శలు గుప్పించారు. గతంలో కరీనా ప్రజలు తమ సినిమాలను చూడకూడదనుకుంటే చూడవద్దని కోరారు. మరికొందరు అమీర్ ఖాన్ సినిమాలలో "హిందూ మతానికి వ్యతిరేకంగా" వివాదాస్పద సన్నివేశాలను కూడా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అలా మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో చాలా రోజులుగా హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తూ వచ్చారు.
ఇక ఇప్పుడు తాప్సీ సినిమా విషయంలో అదే జరుగుతోంది. అనురాగ్ కశ్యప్ కొత్త చిత్రం 'దోబారా' ను బాయ్ కాట్ చేయాలని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. #BoycottDobaara ను వేలసార్లు ట్వీట్ చేశారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, ఇందులో తాప్సీ ప్రధాన పాత్ర పోషించింది. టీవీ ద్వారా టైమ్ ట్రావెల్ చేస్తుంది. అనురాగ్ మరియు తాప్సీకి సంబంధించిన కొన్ని పాత ఇంటర్వ్యూలు తవ్వి సినిమాను బ్యాన్ చేయాలని కోరుకుంటూ ఉన్నారు. #BoycottDobaara అనే హ్యాష్‌ట్యాగ్‌ని కలిగి ఉన్న చాలా ట్వీట్‌లు #BoycottBollywood అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా సూచిస్తాయి.
How the Josh warriors?#BoycottDobaara #BoycottBollywood#BoycottPathan pic.twitter.com/GEajklvMLE
— Nupur S. (Parody) (@NupurReal_) August 18, 2022