ప్రభాస్ నటించిన సలార్ సినిమా మార్చి 21న మళ్ళీ థియేటర్లలో విడుదలైంది. ఈ రీ-రిలీజ్ సమయంలో మొదటి రోజు 3.2 కోట్ల రూపాయల గ్రాస్ తో అద్భుతంగా ప్రారంభమైంది. ప్రభాస్ సినిమాల రీ-రిలీజ్ లలో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. సలార్ రీ-రిలీజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు భారీగా ఉన్నాయి. అది కూడా కేవలం సంవత్సరం క్రితం వచ్చిన ఈ సినిమా ఎటువంటి ప్రత్యేక సందర్భం లేకుండా ఇంత భారీ వసూళ్లు సాధించడం నిజంగా అద్భుతమనే చెప్పొచ్చు. ఈ వీక్ తెలుగులో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో సలార్ నే మూవీ లవర్స్ మొదటి ఆప్షన్ గా భావిస్తున్నారు.
ఈ నెలలో, SVSC, సలార్ రెండు రీ-రిలీజ్‌లు మంచి విజయాన్ని సాధించాయి. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజున ఆర్య 2 ను పెద్ద స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు, రామ్ చరణ్ పుట్టినరోజు నాయక్‌ను తిరిగి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.