అల్లు అర్జున్ కు శ్రీదేవి భర్త మద్దతు
ప్రముఖ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ అల్లు అర్జున్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 Jan 2025 5:47 PM ISTప్రముఖ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ అల్లు అర్జున్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 స్క్రీనింగ్ సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనలో 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలులో ఒక రాత్రి గడిపాడు.
దక్షిణాది ప్రేక్షకులకు తమ అభిమాన హీరోలపై అభిమానం ఎక్కువగా ఉంటుందని.. చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాలకు ప్రేక్షకులు ఇలాగే వస్తారని బోనీకపూర్ అన్నారు. తమిళ హీరో అజిత్ నటించిన ఒక సినిమాకు అర్ధరాత్రి షోకు తాను వెళ్లానని, దాదాపు 20 వేల మంది థియేటర్ దగ్గర ఉన్నారన్నారు. సినిమా థియేటర్ వద్ద అంతమందిని చూడటం తనకు అదే తొలిసారని బోనీ కపూర్ తెలిపారు. సినిమా పూర్తయ్యాక తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వచ్చినప్పుడు కూడా అంతే మంది ప్రేక్షకులు థియేటర్ బయట ఎదురు చూస్తున్నారని చెప్పారు. జనాలు ఎక్కువగా వచ్చినందుకే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన.