షూటింగ్‌లో బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌కు ప్రమాదం, గాయాలు

అమెరికాలో షూటింగ్‌ జరుగుతుండగా బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌కు ప్రమాదం జరిగింది.

By Srikanth Gundamalla  Published on  4 July 2023 1:39 PM IST
Bollywood, Shahrukh Khan, Accident, injured, America,

షూటింగ్‌లో బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌కు ప్రమాదం, గాయాలు

బాలీవుడ్‌ స్టార్ హీరో అప్‌ కమింగ్‌ సినిమా షూటింగ్‌ కోసం అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లారు. అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగిందని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. దీంతో.. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో షారుక్‌ఖాన్‌ ముక్కుకి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో షారుక్‌ఖాన్‌ని పరిశీలించారు వైద్యులు. ప్రమాదం ఏమీ లేదు.. మైనర్‌ సర్జరీ చేయాలని చెప్పారట. దాంతో.. వెంటనే చిన్న సర్జరీ చేసి షారుక్‌ఖాన్‌ని డిశ్చార్జ్‌ కూడా చేసినట్లు తెలుస్తోంది.

షారుక్‌ఖాన్‌కు ప్రమాదం జరిగిందన్న వార్త తెలియడంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. పెద్ద ప్రమాదం లేదని.. చిన్న సర్జరీ చేశారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఈ ప్రమాదం సంభవించిందన్న వార్తలపై షారుక్‌ఖాన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాగా షారుక్‌ఖాన్‌ చివరి సినిమా పఠాన్‌ బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతకుముందు వరుస పరాజయాలు అందుకున్న షారుక్‌ఖాన్‌.. కొన్నాళ్లు గ్యాప్‌ ఇచ్చారు. చివరకు మంచి హిట్‌ అందకోవడంతో మళ్లీ ఉత్సాహంతో షూటింగుల్లో పాల్గొంటున్నారు. షారుక్‌ఖాన్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపైనా భారీ అంచనాలు ఉన్నాయి. జవాన్‌ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.

Next Story