సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్‌

బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడిపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. 'సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా' అని ట్వీట్‌ చేశారు.

By అంజి  Published on  16 Jan 2025 11:00 AM IST
Bollywood, actor Saif Ali Khan, attack, knife, NTR

సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్‌

బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడిపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. 'సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా' అని ట్వీట్‌ చేశారు. దీనిపై 'దేవర టీమ్‌ సైతం స్పందిస్తూ..' ఇది తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్‌ సార్‌' అని పేర్కొంది.

సైఫ్‌ను ఆగంతకుడు ఆరుసార్లు కత్తితో పొడిచారని లీలావతీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అందులో రెండు గాయాలు మరీ లోతుగా ఉన్నాయని పేర్కొన్నాయి. న్యూరోసర్జన్‌ డాక్టర్‌ డింగే, కాస్మొటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ జైన్‌ ఆయనకు సర్జరీ చేస్తున్నట్టు వెల్లడించాయి. సైఫ్‌ను చూసేందుకు భార్య కరీనా, ఆమె సోదరి కరిష్మా ఉదయం 4.30 గంటలకే ఆస్పత్రికి వచ్చారని తెలిసింది. దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ జనవరి 16, గురువారం తెల్లవారుజామున తన ఇంటిలో గుర్తుతెలియని దొంగ దాడి చేయడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీ ఖాన్‌ను తన ఇంటిలో కత్తితో పొడిచాడు. దుండగుడు సైఫ్‌ను మూడు సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దొంగను గుర్తించేందుకు ముంబై పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story