'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌..!

Blockbuster Film RRR OTT Date Fixed. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది

By Medi Samrat
Published on : 4 May 2022 8:30 PM IST

ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌..!

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రూ.1115 కోట్ల రూపాయలు కొల్ల‌గొట్టి రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ వంటి భారీ తారాగ‌ణం నటించగా భారతీయ సినిమాల‌లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ పూర్తి చేసుకున్న నేఫ‌థ్యంలో ఓటీటీ విడుదల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు జీ5, నెట్‌ఫ్లిక్స్‌లలో ఆర్ఆర్ఆర్ త్వరలో స్ట్రీమింగ్‌ కానుందని వినికిడి. ఈ ఏడాది మే 20 నుంచి ఈ సినిమా ఆన్‌లైన్‌లో ప్రసారం కానుంది. అయితే దీని విడుదల తేదీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అధికారిక నివేదికల ప్రకారం.. ఈ చిత్రం రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు రికార్డ్ ధరలకు అమ్ముడైంది. థియేట‌ర్ల‌లో దుమ్ముదులిపిన ఈ సినిమా ఓటీటీ వేదిక‌ల‌లో ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మ‌రి.











Next Story