మరో సారి బేబీ సినిమా హిట్ పెయిర్..?
బేబీ సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటకు
By Medi Samrat Published on 9 Oct 2023 8:30 PM ISTబేబీ సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటకు మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ ద్వయం కొత్త చిత్రంతో ముందుకు రాబోతోందని అంటున్నారు. మరో ప్రేమకథ కోసం ఈ జంట మళ్లీ వెండితెర మీద సందడి చేయబోతోందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
బేబీ సినిమాతో వైష్ణవి చైతన్యకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమెను వరుస ఆఫర్లు చుట్టుముట్టాయి. తాజాగా ఆనంద్ దేవరకొండ సరసన ‘డ్యూయెట్’ సినిమా చేయడానికి ఆమె అంగీకరించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో మిథున్ అనే యువ దర్శకుడు ఓ ప్రేమకథను రూపొందించబోతున్నానని అన్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఇప్పటికే చాలా మంది పేర్లను పరిశీలించారు. చివరగా, ఈ పాత్రకు వైష్ణవి చైతన్య సరిగ్గా సరిపోతుందని చిత్ర బృందం భావించినట్లు కథనాలు వస్తున్నాయి. ‘బేబీ’ నిర్మాతలు వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్‌లో మరో సినిమా చేయాలని భావించారు. కానీ సరైన కథ దొరక్కపోవడంతో ప్రాజెక్ట్ సెట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ జంట మిథున్ దర్శకత్వంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.