అన్నా.. నేను ఎక్కడికీ పోలేదు..!

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పారిపోయాడంటూ కొన్ని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  20 Dec 2023 4:28 PM IST
అన్నా.. నేను ఎక్కడికీ పోలేదు..!

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పారిపోయాడంటూ కొన్ని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాను ఎక్కడికి పారిపోలేదని.. ఇంటి దగ్గరే ఉన్నానని తెలియజేస్తూ వీడియోను విడుదల చేశారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు.. నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండని పల్లవి ప్రశాంత్ కోరారు. కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని.. నేను ఫోన్ కూడా వాడటం లేదు.. ఇది నిజం.. ఎవ్వరూ ఏం చెప్పినా నమ్మకండని పల్లవి ప్రశాంత్ వీడియో పెట్టారు.

‘అన్నా నేను ఏడికి పోలే. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. నేను ఇంటి దగ్గరే ఉన్నా. ఇంతమంది ఇన్ని ఊర్ల నుంచి వచ్చారు.. నేను ఏడికి పోలే.. నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే దయ చేసి నన్ను క్షమించండి. నేను ఏ తప్పు చేయలేదు. ఎవరెవరో చేసినవి నా మీద వేస్తుర్రు. కావాలని నెగిటివ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు.' అని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. నేను ఏడికీ పోను.. అయినా ఆ న్యూస్ చూసి నేనే షాక్ అయ్యా.. నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే నేను వచ్చినప్పటి నుంచి ఫోనే పట్టుకోలేదని తెలిపాడు. నేను ఇంకో పాత ఫోనులో వీడియోలు తీసుకున్నా తప్ప.. ఆ ఫోన్ ముట్టుకోలేదన్నాడు. దయచేసి మీరే ఆలోచించండి. నేను ఇంటికాడే ఉన్నాను. ఏడికి పోలే. టెన్షన్ పడకుర్రి. టెన్షన్ పెట్టాలని చాలా మంది చూస్తున్నారు కానీ, మీరు ఎవరు టెన్షన్ పడకండని వివరణ ఇచ్చారు.

Next Story