తమన్నా ఆగ్రహం.. అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు సీపీఐ నారాయణను..

Bigg Boss Controversy.. Tamanna angry over CPI Narayana's remarks. తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోగానో పాపులర్‌ సంపాదించిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షో తాజాగా ఓటీటీ ప్లాట్‌

By అంజి
Published on : 27 Feb 2022 9:08 AM IST

తమన్నా ఆగ్రహం.. అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు సీపీఐ నారాయణను..

తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోగానో పాపులర్‌ సంపాదించిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షో తాజాగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శనివారం సాయంత్రం బిగ్‌బాస్‌ ఓటీటీ కిక్‌ ప్రారంభమైంది. హీరో నాగార్జున బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అరియానా గ్లోరీ, సరయు, అషురెడ్డితో పాటు చాలా మంది సెలబ్రిటీలు బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ షోపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ డిమాండ్‌ చేసిన సీపీఐ నారాయణ.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ షో రెడ్‌లైట్ ఏరియా క‌న్నా డేంజ‌ర్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బిగ్‌బాస్‌ అనేది సమాజానికి నేరపూరితమైన సంస్థ అని.. ఇది ఓ కల్చరల్‌ షో, గేమ్‌ షో కాదని.. లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌజ్ అని అన్నారు. ఈ షో వల్ల సమాజం నాశనమైపోతుందన్నారు. అందుక‌నే బిగ్‌బాస్ ప్రసారాల‌ను వెంట‌నే ఆపేయాల‌ని డిమాండ్ చేశారు.

అయితే సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ తమన్నా సింహాద్రి ఫైర్‌ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓ టీవీ డిబేట్‌లో పాల్గొన్న తమన్నా సింహాద్రి.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నారాయణను చెప్పుతో కొట్టాలంటూ మాట్లాడింది. టీవీ డిబేట్‌లో కూర్చున్న ఇతర నిపుణులు మాత్రం తమన్నా సింహాద్రి వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. ఆమె తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమన్నా సింహాద్రి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బిగ్‌బాస్‌ షోను సమర్థించింది. చివరకు ఆ షో వల్లే తమకు గుర్తింపు వచ్చిందన్న తమన్నా.. షో నచ్చని వాళ్లు వేరే ఛానల్‌ మార్చుకోవచ్చంటూ సలహా కూడా ఇచ్చింది.

Next Story