బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్
బిగ్‌బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్‌లో మండలం కొల్గూరులో ప్రశాంత్‌తో పాటు
By Medi Samrat Published on 20 Dec 2023 8:00 PM ISTబిగ్‌బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్‌లో మండలం కొల్గూరులో ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బిగ్‌బాస్ 7 ఫినాలే సందర్భంగా ఫ్యాన్స్ చేసిన వీరంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్‌ను, అతని తమ్ముడు మనోహర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బిగ్‌బాస్-7 సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఈ వార్త ముందుగానే లీకవడంతో ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో మరో ఫైనలిస్ట్ అమర్‌దీప్ ఫ్యాన్స్ కూడా అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఇరువర్గాల ఫ్యాన్స్ రోడ్డుపై హంగామా చేశారు. ఇతర కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు. రోడ్డుపై పరస్పరం దాడులకు దిగుతూ.. ఆర్టీసీ బస్సులతో పాటు పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అల్లర్లతో ప్రమేయం ఉన్న వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు.