ఆ మూవీ రెచ్చగొట్టేలా ఉందనే ఫిర్యాదులతో..ఆర్జీవీకి ఏపీ సీఐడీ నోటీసులు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 12:03 PM IST
ఆ మూవీ రెచ్చగొట్టేలా ఉందనే ఫిర్యాదులతో..ఆర్జీవీకి ఏపీ సీఐడీ నోటీసులు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్జీవీ డైరెక్షన్‌లో 2019లో తెరకెక్కిన కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో నమోదైన కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఆ కేసులలో విచారణకు హాజరు కావాలని మరోసారి గుంటూరు సీఐడీ అధికారులు రాంగోపాల్ వర్మకు నోటీసులు జరీ చేశారు. కానీ, ఇప్పటికే సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కేసు ట్రయల్ కొనసాగుతుండగానే ఆయనకు సీఐడీ నుంచి మరోసారి నోటీసులు అందాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గుంటూరు సీఐడీ అధికారులు రాంగోపాల్ వర్మకు ఫిబ్రవరి 10న నోటీసులు జారీ చేశారు. కానీ, విచారణకు ఆయన గైర్హాజరై.. తన న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి పంపారు. సినిమా ప్రమోషన్ ఉన్న నేపథ్యంలో విచారణకు రాలేనని.. తనకు మరో 8 వారాల గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ, ఇవాళ ఆర్జీవీకి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది.
కాగా, రాంగోపాల్ వర్మ 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం పేరుపై తెలంగాణ హైకోర్టులో కొందరు పిల్ వేయడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో విడుదల చేశారు. అయితే యూట్యూబ్‌లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిటే విడుదల చేశారంటూ సీఐడీ పోలీసులకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. అందులో రెచ్చగొట్టే దృశ్యాలను తొలగించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు వర్మపై మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో గతేడాది నవంబరు 29న కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన నోటీసులను ఆర్జీవీకి ఇటీవల ఒంగోలులో సీఐడీ అధికారులు అందజేశారు. ఈ కేసులో విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉండగా గడువు కోరారు.