బాలీవుడ్ బెంగ తీర్చిన ఆ యంగ్ హీరో..

Bhool Bhulaiyaa 2 box office day 3 collection. ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలకు పెద్దగా కలెక్షన్స్ లేకుండా ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  23 May 2022 7:39 AM GMT
బాలీవుడ్ బెంగ తీర్చిన ఆ యంగ్ హీరో..

ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలకు పెద్దగా కలెక్షన్స్ లేకుండా ఉన్న సంగతి తెలిసిందే..! అయితే ఎట్టకేలకు ఓ హిట్ ను ఇచ్చాడు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. భూల్ భూలయ్యా సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టడంలో సక్సెస్ అయ్యింది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు నటించిన భూల్ భూలయ్యా 2 మొదటి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. శుక్రవారం నాడు ₹14 కోట్ల మంచి ఓపెనింగ్‌ను నమోదు చేసిన తర్వాత, వారాంతంలో కూడా మంచి కలెక్షన్స్ ను కంటిన్యూ చేసింది. ఆదివారం టికెట్ కౌంటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, సినిమా విడుదలైన మూడు రోజుల్లో ₹56 కోట్లు దాటింది.

ఈ చిత్రం ఆదివారం నాడు ₹23.51 కోట్లు వసూలు చేసింది. దీంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద మొత్తం 55.96 కోట్లకు చేరుకుంది. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమా బాక్సాఫీస్ గణాంకాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. "#BhoolBhulaiyaa2 infuses oxygen in the lungs of an ailing industry... A ₹ 55 cr+ weekend at a time when most #Hindi films are ending up below ₹ 20 cr lifetime is a MASSIVE ACHIEVEMENT... Fri 14.11 cr, Sat 18.34 cr, Sun 23.51 cr. Total: ₹ 55.96 cr. #India biz." అంటూ ట్వీట్ చేశారు.

'భూల్‌ భులయ్యా 2' సినిమా చూసేందుకు కార్తీక్‌ ఆర్యన్‌ ముంబైలోని గైటీ థియేటర్‌కు వెళ్లాడు. అక్కడ హీరోను చూసిన అభిమానులు అతడి వద్దకు గుంపులుగా చేరారు. తర్వాత అతను టికెట్లు కొనలేకపోయాడు. హౌస్‌ఫుల్ బోర్డ్‌ ఫొటోను చూపించాడు. ఇదే విషయాన్ని కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Next Story
Share it