భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్లే..!

Bhola Shankar Prerelease Event. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భోళా శంకర్.

By Medi Samrat  Published on  2 Aug 2023 9:54 PM IST
భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్లే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుంది. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. భోళా శంకర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఆగస్టు 6న ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ వేడుక హైదరాబాదులోనా, లేక విజయవాడలో జరుపుతారా అనేదానిపై స్పష్టత లేదు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఆదివారం నాడు తమ చానల్లో భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం అంటూ ఓ టీవీ ఛానల్ అప్పుడే ప్రోమోలు వేసుకుంటూ ఉండడంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆరోజు కన్ఫర్మ్ అని స్పష్టంగా తెలుస్తోంది.

తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ వచ్చింది. తెలుగులో మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్లు కొన్ని స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి గ్రాండ్ గా ఈ సినిమాను రూపొందించారని అంటున్నారు. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. కీర్తి సురేశ్ మెగాస్టార్ కు చెల్లెలిగా నటిస్తూ ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. ఇందులో సుశాంత్, వెన్నెల కిశోర్, మురళీశర్మ, రవిశంకర్, తులసి తదితరులు నటించారు.

Next Story