'భోళా శంకర్' మొదటిరోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా.?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By Medi Samrat  Published on  12 Aug 2023 4:31 PM IST
భోళా శంకర్ మొదటిరోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా.?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా కూడా నిరాశపరిచింది. మొదటి రోజు ఈ చిత్రం రూ. 20 నుంచి 25 కోట్ల మధ్య వసూలు చేసింది. చిరంజీవి సినిమాల్లో ఈ మధ్య విడుదలైన వాటిలో బాక్స్ ఆఫీస్ వద్ద పేలవమైన ఓపెనింగ్స్ వచ్చిన చిత్రాల్లో ఇది నిలిచింది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది థియేట్రికల్ బిజినెస్‌లో కేవలం 20% మాత్రమే. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 90 కోట్లకు జరిగింది. సినిమా నష్టాలను తగ్గించుకోవడానికి వీకెండ్ పెర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం.

రజనీకాంత్ ‘జైలర్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. మొదటి షో నుంచి అద్భుతమైన ఓపెనింగ్‌తో కేవలం రెండు రోజుల్లో రూ. 75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రజనీకాంత్ మార్కెట్, తమిళం, కన్నడలోనూ ఎక్కువ ఉంది.

Next Story