నటుడు సుదీప్ పాండే మృతి
పలు భోజ్‌పురి చిత్రాల్లో నటించిన సుదీప్ పాండే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 15 Jan 2025 9:06 PM ISTపలు భోజ్‌పురి చిత్రాల్లో నటించిన సుదీప్ పాండే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటలకు సుదీప్ పాండే గుండెపోటుతో మృతి చెందాడు. కొన్ని రోజులుగా అతడు తన రాబోయే సినిమా షూటింగ్ నిమిత్తం బిజీగా ఉన్నాడు.
సుదీప్ మరణానంతరం ఆయన చాలా కష్టాల్లో ఉన్నారని అతని స్నేహితుల్లో ఒకరు చెప్పారు. మిత్రుడు చెప్పిన దాని ప్రకారం.. సుదీప్ సినిమా కెరీర్ సరిగ్గా సాగడం లేదు. సుదీప్ 'విక్టర్' అనే హిందీ సినిమా తీసి చాలా నష్టపోయాడు. అంతేకాకుండా సుదీప్ వైవాహిక జీవితం కూడా చాలా ఒత్తిడితో సాగింది. సుదీప్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్‌సిపిలో చేరారు. పార్టీలో పదవిని కూడా పొందారు.
భోజ్‌పురి నటుడు సుదీప్ పాండే గతంలో ముంబైలోని అంధేరిలో నివసించారు.. కానీ ఇప్పుడు అతడు తలోజాలో నివసిస్తున్నాడు. ఆయన మృతి సహజమా లేక మరేదైనా జరిగిందా అనేది విచారణ తర్వాతే తేలనుంది. ప్రస్తుతం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సుదీప్ పాండే 2007లో భోజ్‌పురి చిత్రం 'భోజ్‌పురి భయ్యా'తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ చిత్రాన్ని తనే నిర్మించాడు. ఇది కాకుండా అతడు 'భోజ్‌పురియా దరోగా', 'మసిహా బాబు', 'హమర్ సంగీ బజరంగబలి', 'హమర్ లాల్కర్' వంటి అనేక చిత్రాలను నటించాడు.