హైప్ లేదు.. అయినా టికెట్ రేట్లు పెంచితే ఎలా?

భారతీయుడు-2 సినిమా జులై 12న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు తెలుగులో అంతగా హైప్ లేదు.

By Medi Samrat  Published on  11 July 2024 2:30 AM GMT
హైప్ లేదు.. అయినా టికెట్ రేట్లు పెంచితే ఎలా?

భారతీయుడు-2 సినిమా జులై 12న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు తెలుగులో అంతగా హైప్ లేదు. అయితే తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు పెంచేసుకోమని చెప్పారు. ఈ చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లో తక్కువ బజ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల హక్కులు 25 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈరోజు అధిక టికెట్ ధరతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం భారతీయుడు 2 కోసం అధిక టిక్కెట్ ధరలను పెంచుకోడానికి అనుమతించింది. ఈ చిత్రానికి మీడియం తెలుగు బడ్జెట్ చిత్రాల కంటే తక్కువ వ్యాపారం జరిగింది. ఈ అధిక టిక్కెట్ ధరలు ఒక వారం పాటు అమలులో ఉంటాయి. ఈ 7 రోజులకు మల్టీప్లెక్స్‌లలో ₹75 మరియు సింగిల్ స్క్రీన్‌లలో ₹50 పెంపు ఫిక్స్ చేశారు. అలాగే అవసరం బట్టి రోజుకు ఐదు షోలు ఉంటాయి.

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత సురేష్ బాబు బుధవారం తిరుమల శ్రీ వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు మాట్లాడుతూ.. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని అన్నారు. భారతీయుడు 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయితే టికెట్ రేట్స్ పెంచటం కన్నా సినిమా చాలా మందికి అందుబాటులోకి పెట్టాలి.. ఎక్కువమంది వచ్చి సినిమా చూస్తుండాలన్నారు. ఆడియన్స్ థియేటర్స్ కు రావటం లేదు. మేము నిర్మాతలుగా ఎలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్లని థియేటర్స్ కు తీసుకురావాలనేది ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు. సినిమాకు జనం రావడం లేదని ఓ వైపు నిర్మాత అంటున్నా.. మరో వైపు రేట్లు పెంచేశారు.

Next Story