భగవంత్ కేసరి.. బాక్సాఫీస్ ఊచకోత

నందమూరి బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది

By Medi Samrat  Published on  22 Oct 2023 7:20 PM IST
భగవంత్ కేసరి.. బాక్సాఫీస్ ఊచకోత

నందమూరి బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజు నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. లాంగ్ వీకెండ్, దసరా సెలవులు కావడంతో ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా భగవంత్‌ కేసరి కలెక్షన్లకు సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం శనివారం ముగిసేటప్పటికీ వరల్డ్‌వైడ్‌గా రూ.71.02 కోట్లు రాబట్టింది. టైగర్ నాగేశ్వర రావు, లియో లాంటి రెండు భారీ చిత్రాల మధ్య విడుదలైన భగవంత్‌ కేసరికి వసూళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సీడెడ్ లో ఈ సినిమా కలెక్షన్స్ సూపర్ సాలిడ్ గా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఆదివారం, ఆ తర్వాత దసరా పండుగ రోజున ఈ సినిమా వసూళ్లు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూవీలో కాజల్ అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించింది. శ్రీలీల కీలక పాత్ర పోషించగా.. బాలీవుడ్ యాక్టర్‌ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మించారు. ఎస్‌ థమన్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది.

Next Story