షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. బెంగళూరులోని ఓ పబ్‌లో జరిగిన కార్యక్రమంలో అసభ్యకరమైన సైగలు చేశారనే ఆరోపణలతో అతడిపై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నవంబర్ 28న బెంగళూరులోని ఒక పబ్‌లో జరిగిన ప్రైవేట్ ఈవెంట్‌లో ఆర్యన్ ఖాన్ పాల్గొన్నాడు. ఆ సమయంలో అతడు బహిరంగంగా అసభ్యకరమైన సైగ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగినప్పుడు పబ్‌లో మహిళలు కూడా ఉన్నారని, వారి మర్యాదకు భంగం కలిగించేలా ఆర్యన్ ప్రవర్తన ఉందని పేర్కొంటూ ఒవైజ్ హుస్సేన్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆర్యన్ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించి సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల ఆధారంగా సుమోటో విచారణ చేపట్టారు.