బెల్లంకొండ బ్యాక్ టు టాలీవుడ్.. డైరెక్టర్ ఎవరంటే.?
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ చేశాడు.
By Medi Samrat Published on 3 Jan 2024 8:45 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ చేశాడు.ఆశించిన ఫలితం దక్కకపోవడంతో మళ్లీ టాలీవుడ్ లో సందడి చేయాలని భావిస్తున్నాడు. సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు మూడు సంవత్సరాల విరామం ఇచ్చారు. మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించనున్నాడు .బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. ఈ రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ ’టైసన్ నాయుడు’ గా ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో 10వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
బాక్సింగ్ రింగ్‌లో నిలబడి, తనను తాను శక్తివంతుడిగా చెప్పుకునే సర్దార్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో శ్రీనివాస్ డీఎస్పీగా కనిపించనున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్ టైసన్ మెరుస్తున్న పోస్టర్‌తో అతను బాక్సింగ్ రింగ్‌లోకి ప్రవేశించి చివరి ఎపిసోడ్ ఉంది. శ్రీనివాస్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. సినిమాటోగ్రాఫర్ ముఖేష్ జ్ఞానేష్ విజువల్స్ బాగున్నాయి. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ తర్వాత సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.