బండ్ల గణేష్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..!

Bandla Ganesh Withdraw Nomination. బండ్ల గణేష్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలి కాలంలో మా ఎలెక్షన్స్ విషయంలో

By Medi Samrat  Published on  1 Oct 2021 10:43 AM GMT
బండ్ల గణేష్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..!

బండ్ల గణేష్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలి కాలంలో మా ఎలెక్షన్స్ విషయంలో కూడా బండ్ల గణేష్ తనదైన మార్క్ రాజకీయాన్ని చూపించారు. ఏది ఏమైనా జీవితను ఓడించాలనే ఉద్దేశ్యంతో ప్రచారం మొదలు పెట్టిన బండ్ల గణేష్.. 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి బయటికి వచ్చిన బండ్ల గణేశ్ 'మా' ప్రధాన కార్యదర్శి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు కొద్దిరోజుల కిందటే సంచలన ప్రకటన చేశారు. కానీ తాజాగా మాత్రం తాను 'మా' ప్రధాన కార్యదర్శి పదవికి దాఖలు చేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నానని స్పష్టం చేశారు.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు బండ్ల గణేశ్. జీవితను ఓడించేందుకే ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. నా వెనుక ఎవరెవరున్నారో మీకు తెలియదు... నా గెలుపు ఖాయం అంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడేమో తాను పోటీ నుండి తప్పుకున్నట్లు తెలిపాడు. "నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు జనరల్ సెక్రటరీ నామినేషన్ ను వెనక్కి తీసుకుంటున్నా" అంటూ సోషల్ మీడియా ద్వారా నేడు వెల్లడించారు. బండ్ల గణేశ్ ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ లతో కలిసి ఉన్న ఫొటో పెట్టారు.


Next Story