టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఎక్స్ (ట్విట్టర్) లో ఎవరినో టార్గెట్ చేసి ట్వీట్ వేశారు. ఈ పోస్ట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉంటాయా అనే చర్చ మొదలైంది.
బండ్ల గణేశ్ తన ఎక్స్ ఖాతాలో “అది పీకుతా, ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు. మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు” అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఆయన ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో కొందరు నిర్మాతల మధ్య సినిమాల విడుదల తేదీలు, సక్సెస్ క్రెడిట్‌కు సంబంధించిన విషయాలపై వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ చేసిన ఈ ట్వీట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఓ నిర్మాతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.