డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలు గాని టాకీస్

ప్రముఖ ప్రాంతీయ OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో 'బాలు గాని టాకీస్' సినిమాను విడుదల చేయనుంది.

By Medi Samrat  Published on  19 Aug 2024 9:21 PM IST
డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలు గాని టాకీస్

ప్రముఖ ప్రాంతీయ OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో 'బాలు గాని టాకీస్' సినిమాను విడుదల చేయనుంది. సెప్టెంబర్ 13, 2024న ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రానుందని ప్రకటించింది. శివ రామచంద్రవరపు ఈ సినిమాలో హీరోగా నటించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'లో ఓ రోల్ చేశారు. ఈ మూవీకి విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ నిధి సాగర్ నిర్మాతగా, పి.రూపక్ ప్రణవ్ తేజ్ సహ నిర్మాతగా ఉన్నారు. ఇందులో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె ఓ కీలక పాత్ర చేశారు. 'తెలుగు ఇండియన్ ఐడల్ 3'లో ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.

రఘు కుంచె తెలుగు ఇండియన్ ఐడల్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అటువంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ తేదీని వెల్లడించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలుగాని టాకీస్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పట్ల టీమ్ థ్రిల్‌గా ఫీల్ అవుతోందని ఆయన అన్నారు. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అయిన బాలు చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఎలాగైనా తమ ఊరి థియేటర్లో బాలయ్య సినిమా ప్రదర్శించాలనేది అతడి కోరిక. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది సినిమాలో చూడాలి.

Next Story