భగవంత్ కేసరి ఓటీటీ డీల్.. అదిరిపోయింది

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి.

By Medi Samrat  Published on  6 Oct 2023 9:00 PM IST
భగవంత్ కేసరి ఓటీటీ డీల్.. అదిరిపోయింది

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో రికార్డ్ ధరకు భగవంత్ కేసరి సినిమా OTT డీల్ ముగిసింది. భగవంత్ కేసరి డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో రికార్డ్ OTT డీల్ అని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి. మొదటి సింగిల్ కంటే.. రెండవ సింగిల్ ఉయ్యాలో ఉయ్యాలా అనే ఎమోషనల్ సాంగ్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ భాగవత్ కేసరి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాజల్ అగర్వాల్ కథానాయిక. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 19న భగవంత్ కేసరి థియేటర్లలో విడుదల కానుంది. భగవంత్ కేసరి చిత్రం ట్రైలర్ అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ఓ వేదికని ఫిక్స్ చేశారు. ఈ ట్రైలర్ లాంఛ్ ని యూనిర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండ వరంగల్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

Next Story