బిగ్‌బాస్-7 హోస్ట్‌గా బాలకృష్ణ..!
Balakrishna to host Bigg Boss 7. బిగ్ బాస్.. తెలుగులో ఒకప్పుడు విపరీతంగా చూశారు. కానీ సీజన్లు జరిగే కొద్దీ.. హోస్ట్ లు
By M.S.R Published on 21 Dec 2022 5:17 PM ISTబిగ్ బాస్.. తెలుగులో ఒకప్పుడు విపరీతంగా చూశారు. కానీ సీజన్లు జరిగే కొద్దీ.. హోస్ట్ లు మారే కొద్దీ బిగ్ బాస్ కు ఆదరణ తగ్గుతూ వస్తోంది. తెలుగు బిగ్ బాస్ ను జనాలు పట్టించుకోవడమే మానేశారు. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 6' ఆదివారంతో ముగిసింది. ఎల్‌వి రేవంత్ ను ఈ సీజన్ విజేతగా ప్రకటించారు. నివేదికల ప్రకారం, నాగార్జున అక్కినేని షో హోస్ట్ గా నిష్క్రమించినట్లు తెలుస్తోంది. కొత్త సీజన్‌కు హోస్ట్‌గా ఆయన రారని చెబుతూ ఉన్నారు. అయితే మరో ప్రముఖ తెలుగు స్టార్, నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించవచ్చని అంటున్నారు. ఇందులో ఎంత వరకూ నిజం ఉందనే విషయంపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. నందమూరి బాలకృష్ణ ఆహాలో అన్ స్టాపబుల్ షో తో రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే..! ఇక ఓటీటీ నుండి బాలయ్య బాబు బుల్లితెరకు షిఫ్ట్ అయితే రచ్చ మామూలుగా ఉండదని అంటున్నారు.
షో హోస్ట్ గా నాగార్జున నిష్క్రమణకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హోస్ట్ చేయడానికి లాక్ చేశారని.. బాలయ్యకు ఇప్పటికే రియాలిటీ షోలను హోస్ట్ చేసిన అనుభవం ఉన్నందున మేకర్స్ బాలయ్యను సంప్రదించారని పింక్‌విల్లాలో ఒక నివేదిక పేర్కొంది. నాగార్జున ఇటీవల పాన్-ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ'లో కనిపించారు. రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్ మరియు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నాగార్జున అనీష్ పాత్రను పోషించారు.
Next Story