ఈ జన్మలో రాను.. పట్టించుకోను : బాలకృష్ణ ఫైర్‌

కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.

By Medi Samrat  Published on  27 Feb 2025 4:43 PM IST
ఈ జన్మలో రాను.. పట్టించుకోను : బాలకృష్ణ ఫైర్‌

కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలో వేసి నివాళులు అర్పించారు.

నందమూరి బాలకృష్ణతో కొమరవోలు గ్రామస్తులు ఫోటోలు దిగుతుండగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గ్రామాన్ని పట్టించుకోరా అని గ్రామస్తులు ప్రశ్నించగా బాలకృష్ణ మాట్లాడుతూ పట్టించుకోను అంటూ చెప్పారు. ఫోటోలు దిగారుగా ఇక వెళ్ళండి అంటూ ఆగ్రహం చేశారు. కొమరవోలు గ్రామమా అదెక్కడ అని అని అన్నారు. కొమరవోలు గ్రామానికి ఈ జన్మలో రాను అని బాలయ్య, పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు. బాలయ్య అంత కోపంగా ఎందుకు ఆ మాటలు అన్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Next Story