బాల‌య్య‌ 'భగవంత్ కేసరి' టీజ‌ర్ అదిరింది..!

Balakrishna Bhagavanth Kesari Teaser Released. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న 'భగవంత్ కేసరి' టీజర్

By Medi Samrat
Published on : 10 Jun 2023 12:02 PM IST

బాల‌య్య‌ భగవంత్ కేసరి టీజ‌ర్ అదిరింది..!

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న 'భగవంత్ కేసరి' టీజర్ ను ఆయ‌న‌ పుట్టినరోజు సంద‌ర్భంగా శ‌నివారం విడుద‌ల చేశారు. మాస్ యాక్షన్ జోనర్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే టీమ్ ఎనౌన్స్ చేసిన‌ సినిమా టైటిల్, రిలీజ్ చేసిన‌ బాలకృష్ణ లుక్ తో సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. నేడు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. 'అడవి బిడ్డా .. నేలకొండ భగవంత్ కేసరి' అంటూ బాలకృష్ణ చెప్పిన ఎంట్రీ డైలాగ్‌తో పాటు 'ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది' అనే ముగింపు డైలాగ్ ఆక‌ట్టుకున్నాయి. టీజ‌ర్‌లో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్‌లు చెప్ప‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నాయికగా కాజల్ కనిపించనుంది. ఇక ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను 'దసరా'కి విడుదల చేయనున్నారు.



Next Story