బాలయ్య అభిమానులకు షాక్‌.. అఖండ-2 ప్రీమియర్ షోలు రద్దు..!

మరో రెండు గంటల్లో ప్రీమియర్ షో ప్రదర్శన ఉండగా సాంకేతిక కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు అఖండ-2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రకటించింది.

By -  Medi Samrat
Published on : 4 Dec 2025 7:25 PM IST

బాలయ్య అభిమానులకు షాక్‌.. అఖండ-2 ప్రీమియర్ షోలు రద్దు..!

మరో రెండు గంటల్లో ప్రీమియర్ షో ప్రదర్శన ఉండగా సాంకేతిక కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు అఖండ-2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రకటించింది. విడుదలకు ముందు టిక్కెట్లు అన్ని బుకింగ్ అయిన తర్వాత ఇలా రద్దు చేయడమేంటని బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడి సినిమాపై ఆది నుండి కుట్రలు నడుస్తున్నాయని.. అఖండ-2 కు దేశవ్యాప్తంగా వచ్చిన హైప్ ను చూసి కుళ్ళుకుంటున్న కొందరు కావాలనే.. విడుదల విషయంలో అడ్డుకుంటున్నారని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నిర్మాతలపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సినిమా విడుదలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ప్రీమియర్ షో రద్దు కావడం. రేపు థియేటర్లలో విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Next Story