విజయవాడలో బాలయ్య సందడి.. ఈసారి మరింత గ్రాండ్ గా..!

Balaiah Unstoppable Season 2. సందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ షోతో తెలుగు ప్రజలకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  3 Oct 2022 2:57 PM IST
విజయవాడలో బాలయ్య సందడి.. ఈసారి మరింత గ్రాండ్ గా..!

సందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌' షోతో తెలుగు ప్రజలకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఆహా' వేదికగా స్ట్రీమింగ్‌ అయిన అన్‌స్టాపబుల్‌ షో భారీ సక్సెస్‌ అందుకుంది. ఈ షోతో బాల‌కృష్ణలోని మ‌రో కోణాన్ని చూశాం. 'అన్‌స్టాప‌బుల్' రెండో సీజ‌న్ స్టార్ట్ చేస్తున్న‌ట్లు ఆహా సంస్థ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రెండో సీజ‌న్‌ను ఇంకాస్త గ్రాండియ‌ర్‌గా రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తుంది. సీజ‌న్‌-2 ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే సెలబ్రెటీల లిస్ట్‌ను కూడా రెడీ చేశారట.

తాజాగా ఈ షో టీజర్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 టీజర్‌ను అక్టోబర్‌ 4న విజయవాడలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ షో కు 'అ!', 'కల్కి', 'జాంబిరెడ్డి' వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సీజన్ ట్రైలర్ ను 4వ తేదీ విజయవాడలో భారీ ఈవెంట్‌లో విడుదల చేయబోతున్నారు. దాదాపు 30 వేల మంది సమక్షంలో జరగబోయే వేడుక కోసం ప్రైవేట్ జెట్‌లో ఈనెల 4వ తేదీ ఉదయం విజయవాడ వెళుతున్నారు బాలయ్య.


Next Story