బాల‌య్య సుమపై సీరియ‌స్ అయ్యారా..?

Balaiah Satire On Suma Anchoring. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘రుద్రంగి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో

By Medi Samrat
Published on : 30 Jun 2023 8:26 PM IST

బాల‌య్య సుమపై సీరియ‌స్ అయ్యారా..?

జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘రుద్రంగి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుక‌కు సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు యాంకర్ సుమ హోస్ట్‌గా ఉంది. కార్య‌క్ర‌మంలో భాగంగా అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ.. ఒక్కొక్కరి గురించి నాన్‌స్టాప్‌గా మాట్లాడుతుంది. ఇంతలో జగపతి బాబు ప్రసంగించడానికి రెడీ అయ్యారు. కానీ సుమ ఆయనకు మైక్ ఇస్తూ.. జగపతిబాబు సినిమాను ప్ర‌మోట్ చేస్తున్న విధానంపై పొగుడుతూ.. ఆయ‌న‌కు మైక్ ఇచ్చింది. దీంతో పక్కనే ఉన్న బాలయ్య.. ‘‘ఎహే పో.. ఎప్పుడూ.. లొడలొడా వాగేస్తున్నావ్’’ అంటూ సరదాగా ఆమెపై అరిచారు. దీనితో సుమ ముఖం ఒక్కసారిగా బాల‌య్య‌కు దండం పెడుతూ అక్క‌డి నుంచి న‌వ్వుకుంటూ వెళ్లిపోతుంది. మైక్ అందుకున్న జ‌గ‌ప‌తి బాబు సైతం ఆ క్ష‌ణంలో న‌వ్వు ఆపుపోలేక‌పోయాడు. బాలకృష్ణ‌ అన్న మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొంద‌రు బాల‌య్య సుమ‌ను అవ‌మానించార‌ని పోస్టులు పెడుతున్నారు.



Next Story