విషాదం.. ‘బలగం’ నటుడు మృతి

బ‌ల‌గం సినిమా న‌టుడు నర్సింగం మంగ‌ళ‌వారం మృతి చెందారు.

By Medi Samrat  Published on  5 Sept 2023 6:42 PM IST
విషాదం.. ‘బలగం’ నటుడు మృతి

బ‌ల‌గం సినిమా న‌టుడు నర్సింగం మంగ‌ళ‌వారం మృతి చెందారు. 'బలగం' చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్‌లో కనిపించిన నర్సింగం మృతి చెందారు. నర్సింగం మృతి ప‌ట్ల‌ డైరెక్టర్ వేణు నివాళులర్పిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.

'నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుడిని చూసుకొని.. మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి.. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను. ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించారు నాకోసం అని ట్వీట్ చేశారు.

Next Story