బాలీవుడ్ కపుల్ రణ్‌బీర్ సింగ్, ఆలియా భట్‌లకు నిరసన సెగ తగిలింది. 'బ్రహ్మాస్త' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి వచ్చిన ఆలియా, రణ్‌బీర్ సింగ్‌లు మహాకాళేశ్వర ఆలయానికి వెళ్లారు. అయితే వారిని భజరంగ్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. వారిని ఆలయంలోకి అనుమతించే ప్రసక్తే లేదంటూ నిరసనకు దిగారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని చేసిన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన క్లిప్స్ ఇటీవల వైరల్ అయ్యాయి.
దీంతో ఆమెపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఆలియా దంపతులు నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 'బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర' అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆలియా చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బ్రహ్మాస్త్రను చూడాలనుకుంటే చూడండి లేదంటే చూడకండంటూ ఆలియా వ్యాఖ్యానించడంతో వివాదం నెలకొంది. బ్రహ్రాస్త్ర విడుదల నేపథ్యంలో ఉజ్జయిని మహా కాళేశ్వర్ దర్శనంకు చిత్ర యూనిట్ వచ్చింది.
ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌ను విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో అడ్డుకున్నారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు రణబీర్ కపూర్, అలియా భట్ మంగళవారం సాయంత్రం మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకోలేకపోయారు. ఆలయం దగ్గర పోలీసులు, కార్యకర్తల మధ్య మాటల వాగ్వాదం జరిగింది. దీంతో మహాకాళేశ్వరాలయం దగ్గర రెండు గంటలకు పైగా గందరగోళం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. చివరికి దర్శకుడు అయాన్ ముఖర్జీకి మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఆయనొక్కడే దర్శనం చేసుకొని వచ్చినట్టు తెలుస్తోంది.