దరిద్రంగా అడ్వాన్స్ బుకింగ్స్.. భారీ బడ్జెట్ సినిమా వాయిదా

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'బడే మియాన్ చోటే మియాన్' చిత్రం భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో విడుదలకు సిద్ధమైంది

By Medi Samrat  Published on  9 April 2024 8:15 PM IST
దరిద్రంగా అడ్వాన్స్ బుకింగ్స్.. భారీ బడ్జెట్ సినిమా వాయిదా

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'బడే మియాన్ చోటే మియాన్' చిత్రం భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో విడుదలకు సిద్ధమైంది. ఆ చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేకపోవడంతో చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది. సినిమా విడుదలకు ముందు పేలవమైన అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా మేకర్స్ సినిమాను వాయిదా వేశారు.

బడే మియాన్ చోటే మియాన్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. బుకింగ్స్ కూడా తెరిచారు. అయితే సినిమాకు స్పందన చాలా ఘోరంగా ఉంది. ఈ బుకింగ్ ట్రెండ్‌ల కారణంగా, రంజాన్ రోజున విడుదలను ఏప్రిల్ 11వ తేదీకి టీమ్ వాయిదా వేసింది. ఘోరమైన అడ్వాన్స్‌ బుకింగ్స్ కారణంగా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమా విడుదలను వాయిదా వేయడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను ముంబై, లండన్, అబుదాబి, స్కాట్లాండ్, జోర్డాన్‌లలో చిత్రీకరించారు. యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా బడ్జెట్ ఖర్చు చేశారు. అక్షయ్, టైగర్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమోనని అభిమానులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ పోషిస్తుండగా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ కూడా నటించారు.

Next Story