భారీ బ్లాక్ బస్టర్ అయిన బేబీ

Baby Movie Worldwide Collections. 'బేబి' సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకుంది. మాత్రం మొదటిరోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తూ

By Medi Samrat  Published on  20 July 2023 9:45 PM IST
భారీ బ్లాక్ బస్టర్ అయిన బేబీ

'బేబి' సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకుంది. మాత్రం మొదటిరోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది బేబీ. ఈ సినిమా 6 రోజులలో పూర్తి చేసుకుంది. ఈ 6 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 43.8 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా 60 కోట్ల మార్క్ ను టచ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే సినిమాకు యువత బాగా క్యూ కడుతూ ఉంది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ యూతుఫుల్ ఎంటెర్టైనర్ బేబీ. కలర్ ఫోటో సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న రచయిత సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సక్సెస్ మీట్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఒక హీరోకు ఈ కథ చెబుదామనుకుంటే.. ఆ డైరెక్టర్ అయితే కథ కూడా వినను అన్నాడని బాధ పడ్డాడు. ఎస్.కె.ఎన్ నా ఫ్రెండ్ అవడం నా అదృష్టం. నన్ను నమ్మి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. డైరెక్టర్ మారుతి‌గారికి మా అందరి కంటే ఎక్కువగా సినిమా మీద నమ్మకం ఉండేది. ఇలాంటి మంచి సినిమాలే ఫ్యూచర్‌లోనూ చేస్తానని మాటిస్తున్నానని అన్నారు.


Next Story