భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న అవతార్-2

Avatar 2 box office collection in India. అవతార్-2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది.

By M.S.R  Published on  18 Dec 2022 9:30 PM IST
భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న అవతార్-2

అవతార్-2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. ఈ సినిమా తొలి రోజు రూ.41 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్‌ దాదాపు రూ.45 కోట్లు దాటింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమా రెండు రోజుల్లోనే ఇండియన్‌ బ్యాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లు కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు ఆదివారం కూడా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టడం ఖాయం. అవతార్-2 స్లో గా ఉందని రివ్యూలు వచ్చినా.. ఆఖరి గంట చాలా బాగుండడం.. విజువల్స్ హైలైట్ గా ఉండడంతో ఈ సినిమాను చూడడానికి ఎగబడుతూ ఉన్నారు.

దాదాపు రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మన దేశంలో డిసెంబర్‌ 16 న విడుదలైంది. ఇంగ్లిష్, హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేశారు. అవతార్ మొదటి రోజు రూ.41 కోట్లు వసూలు చేసినప్పటికీ, అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా తొలి రోజు వసూళ్లను దాటలేకపోయింది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రం విడుదలైన తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.52 కోట్లు రాబట్టింది. భారత్ లో ఏ హాలీవుడ్ సినిమాకైనా ఇదే అత్యధికం. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును అవతార్ కొల్లగొడుతుందని భావించినప్పటికీ.. వీలు పడలేదు.


Next Story