షారుఖ్ ఖాన్-అట్లీ మల్టీ స్టారర్ ఉందట

షారుఖ్ ఖాన్ యొక్క జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

By Medi Samrat  Published on  19 Sep 2023 3:02 PM GMT
షారుఖ్ ఖాన్-అట్లీ మల్టీ స్టారర్ ఉందట

షారుఖ్ ఖాన్ యొక్క జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జవాన్ బ్లాక్ బస్టర్ విజయంతో బాలీవుడ్‌లో దర్శకుడు అట్లీతో సినిమా చేయడానికి పలువురు స్టార్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక అట్లీ జవాన్ సినిమా కోసం చాలా ఏళ్లు కష్టపడ్డాడు.. చాలా రోజులు ఎదురుచూశాడు. ఇక తన తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో కూడా అట్లీ ఓ క్లారిటీతో ఉన్నాడని తెలుస్తోంది.

అట్లీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ షారుక్ ఖాన్-విజయ్ మల్టీస్టారర్‌పై దృష్టి సారించాడు. జవాన్‌లో ‘విజయ్’ అతిధి పాత్రలో నటిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇది వర్కవుట్ కాలేదు. అతిధి పాత్రను సంజయ్ దత్ పోషించాడు. షారుఖ్ ఖాన్ -విజయ్ మల్టీస్టారర్ గురించి అట్లీ మాట్లాడుతూ, “నా పుట్టినరోజు పార్టీలో విజయ్, షారూఖ్ ఖాన్ ఇద్దరూ తమ ఇద్దరి కోసం స్క్రిప్ట్ తీసుకురావాలని నన్ను అడిగారు. ఇద్దరూ ఓకే చెప్పారు. వాళ్లు నా పుట్టిన రోజు కావడంతో అలా చెప్పారని అనుకున్నాను.” అంటూ నవ్వులు పూయించాడు అట్లీ. ఆ తర్వాత విజయ్ నిజంగానే మంచి కథ అనుకుని ఉంటే దాని మీద దృష్టి పెట్టు అని మెసేజ్ చేశారు. అదే సమయంలో నా పక్కనే ఉన్న షారుఖ్ ఖాన్ “మీరు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారా..?? ఇద్దరం కలిసి సినిమా చేస్తాం కదా..?" అని అడిగారు. నేను వెంటనే “అవును సార్..” అని షారుఖ్ ఖాన్ తో అన్నాను. సూపర్‌స్టార్స్ ఇద్దరూ మల్టీస్టారర్‌పై చాలా ఆసక్తిగా ఉన్నారని అట్లీ తెలిపాడు. నేను వారిద్దరి ఇమేజ్ కు తగ్గ కథ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నానని అట్లీ అన్నాడు.

Next Story