నటి భారతి జాఫరీ క‌న్నుమూత‌

Ashok Kumar's Daughter And Actor Bharti Jaffery Dies. సినీ ప్రముఖుడు, లెజెండరీ అశోక్ కుమార్ కుమార్తె, నటి 'భారతి జాఫ్రీ' మరణించారు.

By Medi Samrat
Published on : 21 Sept 2022 12:17 PM

నటి భారతి జాఫరీ క‌న్నుమూత‌

సినీ ప్రముఖుడు, లెజెండరీ అశోక్ కుమార్ కుమార్తె, నటి 'భారతి జాఫ్రీ' మరణించారు. భారతీ జాఫ్రీ మంగళవారం, సెప్టెంబర్ 20న కన్నుమూశారు. ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ వార్తలను నందితా పూరి ధృవీకరించారు. భారతి అంత్యక్రియలు చెంబూరు శ్మశాన వాటికలో జరిగాయి. ఆమె అల్లుడు, నటుడు కన్వల్‌జిత్ సింగ్ ఆమె మరణాన్ని ధృవీకరించారు. "Our beloved Bharti Jaffery, daughter, sister, wife, mother, grandmother, aunt, neighbour, friend and inspiration has departed today 20 Sep (sic)," అని కన్వల్‌జిత్ సింగ్ జాఫ్రీ చిత్రాలను పంచుకుంటూ Instagram లో రాశారు.

భారతి జాఫ్రీ హజార్ చౌరాసి కి మా (1998), సాన్స్ (1999), డామన్: ఎ విక్టిమ్ ఆఫ్ మ్యారిటల్ వాయిలెన్స్ (2001) వంటి చిత్రాలలో కొన్ని ముఖ్యమైన పాత్రలలో మంచి నటనను ప్రదర్శించారు. ఆమె నటుడు సయీద్ జాఫ్రీ సోదరుడు హమీద్ జాఫ్రీని వివాహం చేసుకుంది. అనురాధ పటేల్ ఆమె కుమార్తె.. రూపా వర్మ, ప్రీతి గంగూలీ, అరూప్ గంగూలీ ఆమె తోబుట్టువులు. అశోక్ కుమార్ డిసెంబర్ 10, 2001న మరణించారు. ఆయన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా స్థానాన్ని సంపాదించుకున్నారు.


Next Story