రూ.37 కోట్ల విలువైన ఆస్తిని కొన్న స్టార్ హీరో కొడుకు..!

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్క్‌లోని రెండు అంతస్తుల బిల్డింగ్ ను రూ. 37 కోట్లకు కొనుగోలు చేశాడు

By Medi Samrat  Published on  29 July 2024 9:45 PM IST
రూ.37 కోట్ల విలువైన ఆస్తిని కొన్న స్టార్ హీరో కొడుకు..!

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్క్‌లోని రెండు అంతస్తుల బిల్డింగ్ ను రూ. 37 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆస్తి బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పటికే అతని తల్లిదండ్రులు, షారుఖ్, గౌరీ ఖాన్‌ల యాజమాన్యంలో ఉంది. వీరు గతంలో అక్కడే నివసించారు. ది ఎకనామిక్ టైమ్స్ నివేదించిన ప్రకారం.. ఈ ఏడాది మేలో ఈ బిల్డింగ్ కు సంబంధించిన లావాదేవీలు జరిగాయి. రూ. 2.64 కోట్ల విలువైన స్టాంప్ డ్యూటీ చెల్లించారు. 2023లో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ అలీబాగ్‌లో ఓ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. సుహానా ఖాన్ థాల్ విలేజ్, అలీబాగ్‌లోని ప్రాపర్టీలో రూ. 12.91 కోట్లకు పెట్టుబడి పెట్టింది. సుహానా రూ. 77.46 లక్షల స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. ఆర్యన్ ఖాన్ తన తండ్రి షారూఖ్ ఖాన్ లాగా నటుడు అయితే అవ్వలేదు. అతను 'స్టార్‌డమ్' పేరుతో ఆరు ఎపిసోడ్‌ల డిజిటల్ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సిరీస్‌లో బాబీ డియోల్ నటించారు. రణబీర్ కపూర్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఆర్యన్ ఇటీవలే షో షూట్‌ను ముగించాడు.

Next Story