అర్జున్-మలైకా పెళ్లి అంటూ వార్తలు

Arjun Kapoor reacts to marriage rumours with Malaika Arora. మలైకా అరోరా, అర్జున్ కపూర్ మూడు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నారు.

By Medi Samrat  Published on  18 May 2022 7:05 PM IST
అర్జున్-మలైకా పెళ్లి అంటూ వార్తలు

మలైకా అరోరా, అర్జున్ కపూర్ మూడు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరూ 2019లో తమ రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. గత కొంతకాలంగా వీరి పెళ్లిపై పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఓ పోర్టల్ పేర్కొంది. ఈ జంట ముంబైలోనే వివాహం చేసుకోనున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ పుకార్లపై అర్జున్ కపూర్ కూడా స్పందించాడు. మలైకా అరోరాతో తన పెళ్లి పుకార్లపై అర్జున్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో స్పందించాడు. "Love how everyone seems to know more about my life than I do (sic)." అంటూ నవ్వుతున్న ఈమోజీని పోస్ట్ చేశాడు.


అర్జున్, మలైకాలు ఇప్పటికే వివాహం గురించి చర్చించుకున్నారు. 2021లోనే పెళ్లి జరగాల్సి ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి కారణంగా డేట్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక ఈ ఏడాది వారి పెళ్ళికి సంబంధించి ఏ డేట్ ను కూడా ఫైనల్ చేయలేదు. వారు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన వార్తలను వినవచ్చు. మలైకా, అర్జున్ ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ప్రస్తుతం మలైకా వయసు 48 కాగా అర్జున్ వయసు 36 సంవత్సరాలే..!










Next Story