రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెహమాన్.. ఎవరినీ వదిలిపెట్టనంటూ..!

సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ఇటీవల తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  24 Nov 2024 7:11 PM IST
రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెహమాన్.. ఎవరినీ వదిలిపెట్టనంటూ..!

సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ఇటీవల తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తన రిలేషన్ షిప్ కు సంబంధించి ఆరోపణలు చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపారు . విడాకుల వార్త బయటకు వచ్చినప్పటి నుండి చాలా పుకార్లు వచ్చాయి. ఇది రెహమాన్‌కి కోపం తెప్పించింది.

రెహమాన్ లాయర్ల బృందం వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అతని విడాకుల గురించి తప్పుడు పోస్టులు పెట్టిన వారందరినీ వీడియోలను తీసివేయమని విజ్ఞప్తి చేసింది. మీడియా విశ్లేషకులు అలా చేయడంలో విఫలమైతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెహమాన్ భార్య సైరా భాను కూడా పుకార్లపై స్పందించారు. రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని, ఆయననేమీ అనొద్దని కోరింది. గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని, అందుకే రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నానన్నారు. యూట్యూబ్ కు, యావత్ యూట్యూబర్లకు, తమిళ మీడియాకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే దయచేసి రెహమాన్ గురించి చెడుగా ప్రచారం చేయవద్దు, నా అనారోగ్యం వల్లే చెన్నై నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు సైరా భాను.

Next Story