అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు నటించిన యాక్షన్-డ్రామా 'ఘాటి' విడుదల మరోసారి వాయిదా పడింది. అధికారిక ప్రకటనలో, నిర్మాతలు ఆలస్యం వెనుక గల కారణాలను తెలియజేశారు. జూలై 11, 2025న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం ఇప్పుడు కొన్ని నిర్మాణ పనుల కారణంగా వాయిదా పడింది. నిర్మాణ సంస్థ, UV క్రియేషన్స్, దాని X హ్యాండిల్‌లో వివరణ ఇచ్చింది. సినిమా విడుదల ఆలస్యం అవుతున్నందుకు క్షమించాలని కోరింది. తప్పకుండా మంచి అవుట్ ఫుట్ అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని తెలిపారు.
ఈ సినిమా విడుదల వాయిదా పడటం ఇది రెండోసారి. 'ఘాటి' మొదట ఈ ఏడాది ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉంది. తరువాత విడుదల వాయిదా పడింది. UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన 'ఘాటి' చిత్రం అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వచ్చిన 'వేదం' చిత్రం తర్వాత రెండవ సినిమా.