వామిక ఫొటోలను ప్రచురించనందుకు.. మీడియాకు ధన్యవాదాలు తెలిపిన అనుష్క శర్మ

Anushka Sharma Thanks Media For Not Publishing Pics Of Daughter Vamika Taken. అనుష్క శర్మ.. తన కుమార్తె వామికా ఫొటోలు, వీడియోలను ప్రచురించనందుకు ఫొటో గ్రాఫర్లకు, అభిమానుల క్లబ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

By అంజి  Published on  20 Dec 2021 8:17 AM GMT
వామిక ఫొటోలను ప్రచురించనందుకు.. మీడియాకు ధన్యవాదాలు తెలిపిన అనుష్క శర్మ

ఇటీవల టీమ్ఇండియా ఆట‌గాళ్లు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెలుతుండ‌గా.. విమానాశ్ర‌యం వ‌ద్ద ఎదురుచూస్తున్న ఫోటోగ్రాప‌ర్ల‌ను చూసిన విరాట్ కోహ్లీ.. త‌న గారాల ప‌ట్టి వామికా ఫోటోలు తీయొద్ద‌ని ఫోటోగ్రాఫ‌ర్ల‌ను కోరాడు. అయితే అప్పటికే కొంద‌రు ఫొటోగ్రాఫర్లు వామిక ఫొటో క్లిక్‌మనిపించారు. కానీ కోహ్లీ అభ్యర్థన మేరకు మీడియా ప్రతినిధులు ఎవరూ కూడా వామిక ఫొటోను బయటపెట్టలేదు. తాజాగా అనుష్క శర్మ.. తన కుమార్తె వామికా ఫొటోలు, వీడియోలను ప్రచురించనందుకు ఫొటో గ్రాఫర్లకు, అభిమానుల క్లబ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

అభిమానులను, మీడియా ప్రతినిధులను ఉద్దేశించి సోషల్‌ మీడియా వేదికగా అనుష్క శర్మ ఇలా అన్నారు. వామికా ఫొటోలు/వీడియోలను ప్రచురించనందుకు ఫొటో గ్రాఫర్లకు, చాలా మంది మీడియా సోదరులకు మేము ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులుగా.. ఫొటోలను తీసుకువెళ్ళిన కొద్దిమందికి మా విన్నపం. మేము మా కుమార్తె కోసం గోప్యతను కోరుకుంటాము. మీడియా, సోషల్ మీడియాకు దూరంగా తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికి ఆమెకు మా వంతు కృషి చేయాలనుకుంటున్నాము. వామిక పెద్దయ్యాక మేం ఆమెకు ఎలాంటి అడ్డంకులు చెప్పం.. కాబట్టి ఇప్పుడు మీ మద్దతు అవసరం. దయతో ఈ విషయంలో సంయమనం పాటించండి. అని పేర్కొంది.

కుమార్తె వామికను మీడియాకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచేందుకు అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీలు ఎంతో ప్రయత్నిస్తున్నారు. వామికా కు ఓ వ‌య‌స్సు వ‌చ్చేంత వ‌ర‌కు ఆమె ఫోటోల‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చూపించ‌కూడ‌ద‌ని కోహ్లీ దంప‌తులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే వారు తెలియ‌జేశారు.ప‌లు సంద‌ర్భాల్లో త‌మ చిన్నారితో క‌లిసి దిగిన ఫోటోల‌ను కోహ్లీ దంప‌తులు సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్న‌ప్ప‌టికి అందులో వామిక ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు పడుతున్నారు.

Next Story
Share it