వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న అనుష్క శ‌ర్మ‌

Anushka Sharma shares gorgeous beach photos from holiday with Virat Kohli and Vamika. నటి అనుష్క శర్మ ప్రస్తుతం వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ ఉంది.

By Medi Samrat
Published on : 12 Jun 2022 7:21 PM IST

వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న అనుష్క శ‌ర్మ‌

నటి అనుష్క శర్మ ప్రస్తుతం వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ ఉంది. నారింజ రంగు స్విమ్‌సూట్, టోపీ ధరించి బీచ్‌లో ఉన్న కొన్ని ఫోటోలను అనుష్క శర్మ షేర్ చేసింది. తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీ, కుమార్తె వామికతో కలిసి తిరుగుతూ ఉంది అనుష్క. ఫోటోలలో, అనుష్క బీచ్‌లో ఉంది. ఆమె వెనుక సముద్రం ఉంది. "The result of taking your own photos…" అని అనుష్క రాసి ఫోటోలను పోస్టు చేసింది.

నెట్ ఫ్లిక్స్ షో 'చక్ దా ఎక్స్ ప్రెస్' నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న అనుష్క భర్త విరాట్ కోహ్లీతో మాల్దీవుల పర్యటనకు వెళ్లింది. అక్కడ స్విమ్ సూట్ తో బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫోటోలను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. అభిమానులు హార్ట్ ఎమోజీలతో పోస్ట్‌పై కామెంట్లు చేశారు. తన మునుపటి ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో, అనుష్క వామిక ఫోటోను షేర్ చేసింది.

జీరో (2018) నుండి సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క శర్మ స్పోర్ట్స్ డ్రామా చక్దా ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. భారత మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.













Next Story