డార్లింగ్‌కు స్వీటీ విషెస్‌.. ప్రభాస్‌ బెస్ట్‌ అంటూ..

Anushka birthday wishes to prabhas. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సంద్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో పలువురు,

By అంజి  Published on  23 Oct 2021 7:00 AM GMT
డార్లింగ్‌కు స్వీటీ విషెస్‌.. ప్రభాస్‌ బెస్ట్‌ అంటూ..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సంద్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో పలువురు అభిమానులు పెద్ద ఎత్తును డార్లింగ్‌ ప్రభాస్‌కు బర్త్‌ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫేసుబుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రభాస్‌ బర్త్‌ డే సెలబ్రెషన్స్‌ రచ్చ సాగుతోంది. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కు హీరోయిన్‌ అనుష్క శెట్టి స్పెషల్ బర్త్‌ విషెస్‌ తెలిపారు. ప్రభాస్‌ ప్రతి అంశంలో బెస్ట్‌గా ఉండాలని, అతని కథలన్ని విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు అనుష్క పేర్కొంది. అందరి హృదయాలను ప్రభాస్‌ గెలుచుకోవాలన్నారు.


మిర్చి, బహుబలి చిత్రాల్లో ప్రభాస్‌తో అనుష్క కలిసి నటించింది. దీంతో వీరిద్దరి జోడి బాగా కుదిరిందంటూ, పెళ్లి చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఉట్టి మాటలేనంటూ చాలా సందర్భాల్లో అభిమానులకు తెలిసివచ్చింది. బహుబలి తర్వాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కె, నాగ్‌ అశ్విన్‌, స్పిరిట్‌ చిత్రాలకు ప్రభాస్‌ ఒకే చెప్పాడు. ఇవన్నీ కూడా పాన్‌ ఇండియా చిత్రాలే. తాజాగా ప్రభాస్‌ నటించిన 'రాధేశ్యామ్‌' నుండి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్దే నటిస్తుండగా రాధాకృష్ణా కుమార్‌ దర్శకత్వం వహించారు.

Next Story
Share it