మరో విషాదం.. గుండెపోటుతో న‌టుడు నితీష్ పాండే క‌న్నుమూత‌

Anupamaa actor Nitesh Pandey passes away at 51. రోడ్డుప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌ నటి వైభవి ఉపాధ్యాయ మరణవార్త విని షాక్ లో ఉన్న‌ అభిమానుల‌కు

By Medi Samrat
Published on : 24 May 2023 11:42 AM IST

మరో విషాదం.. గుండెపోటుతో న‌టుడు నితీష్ పాండే క‌న్నుమూత‌

రోడ్డుప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌ నటి వైభవి ఉపాధ్యాయ మరణవార్త విని షాక్ లో ఉన్న‌ అభిమానుల‌కు.. మరో విషాద వార్త. ప్రముఖ నటుడు నితీష్ పాండే బుధ‌వారం క‌న్నుమూశారు. నితీష్ పాండే గుండెపోటుతో మరణించాని స‌మాచారం. ఆయ‌న‌ వయస్సు 51 సంవత్సరాలు. గంట‌ల వ్య‌వ‌ధిలో ఇరువురు న‌టుల‌ను కోల్పోవ‌డంతో బుల్లితెర తారాగ‌ణం తీవ్ర‌విషాదంలో మునిగిపోయింది.

నితీష్ పాండే బుధవారం తెల్లవారుజామున 1.30 గంటలకు గుండెపోటుకు గుర‌య్యారు. గుండెపోటు కారణంగా ఆయ‌న‌ మరణించారు. ఆయన మ‌ర‌ణంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారని రచయిత సిద్ధార్థ్ నగర్.. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధృవీకరించారు. నితీష్.. షూటింగ్ కోసం ఇగత్‌పూర్ వెళ్లినట్లు సిద్ధార్థ్ నగర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కడ రాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. నితీష్ పాండే ప్ర‌స్తుతం ప్రసిద్ధ టీవీ షో అనుపమలో ధీరజ్ కపూర్ పాత్రలో కనిపిస్తున్నారు.

నితీష్ పాండే 'తేజస్', 'సాయా', 'మంజిలీన్ అప్నీ అప్నీ', 'కుచ్ తో లోగ్ కహెంగే', 'ఏక్ రిష్తా పార్టనర్‌షిప్ కా', 'మహారాజా కీ జై హో', 'హీరో-మిస్సింగ్ మోడ్‌తో సహా పలు దారావాహిక‌ల‌లో న‌టించారు. అలాగే.. 'బదాయి దో', 'మదారి', దబాంగ్-2 చిత్రాలలో కూడా క‌నిపించారు.


Next Story