సిక్కుగా 'సల్మాన్'
Antim First Look. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' తర్వాత సల్మాన్ ఖాన్ కూడా తన కొత్త సినిమాలో సిక్కుగా నటించబోతున్నాడు.
By Medi Samrat Published on 10 Dec 2020 11:48 AM ISTఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' తర్వాత సల్మాన్ ఖాన్ కూడా తన కొత్త సినిమాలో సిక్కుగా నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం 'అంతిమ్'. ఈ సినిమాలోని సల్మాన్ ఖాన్ ఫస్ట్‌లుక్‌ను ఆయన బావ ఆయుష్ శర్మ(అర్పిత ఖాన్ శర్మ భర్త) గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ సినిమాలో ఆయుష్ శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ 'అంతిమ్'ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మరాఠి క్రైం ముల్షీ ప్యాట్రన్ అడాప్షన్ నేపథ్యంలో సాగనుంది. ఇందులో సల్మాన్ సిక్కు పోలీసు ఆఫీసర్‌గా సరికొత్త గెటప్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇక సల్మాన్ ఖాన్ ను పలు వివాదాలు వెంటాడుతూ ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఓ టీవీ షోలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వాల్మీకి సామాజిక వర్గంపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేసినట్టు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ రాజస్థాన్ హైకోర్టును సల్మాన్ ఆశ్రయించాడు. ఇలాంటి పిటిషన్ ఒకటి సుప్రీంకోర్టులో పెండింగులో ఉందని, దానిపై నిర్ణయం వెలువడే వరకు ఈ పిటిషన్‌ను విచారించవద్దని సల్మాన్ తరపు న్యాయవాది నిశాంత్ బోరా కోర్టును కోరడంతో న్యాయస్థానం సల్మాన్ పిటిషన్ విచారణను 8 వారాలపాటు వాయిదా వేసింది. 2017లో తన సినిమా 'టైగర్ జిందా హై' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ టీవీ టాక్ షోలో పాల్గొన్న సల్మాన్ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినట్టు జోధ్‌పూర్, చరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.