తెలుగు ఆడియన్స్ మరో సినిమాను హిట్ చేశారు

Another movie hit the Telugu audience. తెలుగు సినీ ప్రియులకు మంచి సినిమా అని తెలియాలంతే.. భాషతో సంబంధం లేకుండా

By Medi Samrat  Published on  16 Oct 2022 7:30 PM IST
తెలుగు ఆడియన్స్ మరో సినిమాను హిట్ చేశారు

తెలుగు సినీ ప్రియులకు మంచి సినిమా అని తెలియాలంతే.. భాషతో సంబంధం లేకుండా థియేటర్లకు పరుగెడతారు. తాజాగా 'కాంతారా' సినిమా మీద తెలుగు సినీ ప్రియుల దృష్టి పడింది. సెప్టెంబర్‌ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం 100కోట్ల మార్కును టచ్‌ చేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ సంస్థ రిలీజ్‌ చేసింది. ఈ సినిమా తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. రిలీజ్‌ రోజే బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకున్న మొదటి సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది. కాంతారా చిత్రానికి తెలుగులో రూ.2 కోట్ల వరకు బిజినెస్‌ అయింది. మొదటి రోజే ఈ చిత్రం రూ.2.2 కోట్ల షేర్‌ కలెక్షన్‌లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాను రిషబ్‌శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించాడు. రిషబ్‌శెట్టికి జోడీగా సప్తిమీ గౌడ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్‌ ఫేం హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించారు.


Next Story