బుల్లెట్ ట్రైన్‌ వేగంతో దూసుకుపోతున్న‌ 'యానిమ‌ల్' క‌లెక్ష‌న్లు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్ సినిమా' ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది.

By Medi Samrat  Published on  10 Dec 2023 5:30 PM IST
బుల్లెట్ ట్రైన్‌ వేగంతో దూసుకుపోతున్న‌ యానిమ‌ల్ క‌లెక్ష‌న్లు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్ సినిమా' ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ఈ సినిమా క‌లెక్ష‌న్‌ల‌లో బుల్లెట్ స్పీడ్ తో ప‌రుగెడుతుంది. ఈ సినిమా బిజినెస్ స్పీడ్ చూస్తే.. షారుఖ్ ఖాన్ 'పఠాన్' - 'జవాన్, సన్నీ డియోల్ 'గదర్ 2' చిత్రాల రికార్డుల‌ను బ్రేక్ చేసేవిధంగా క‌నిపిస్తోంది. 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లు రాబట్టిందో చూద్దాం.

రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న నటించిన 'యానిమల్' డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో భారీ వసూళ్లు రాబట్టి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 116 కోట్లతో ఖాతా తెరిచింది.

వారం రోజుల్లోనే ఈ సినిమా అత్యంత వేగంగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 9 రోజుల్లో ఈ సినిమా బిజినెస్ అమాంతం పెరిగింది. మేకర్స్ విడుదల చేసిన డేటా ప్రకారం.. 'యానిమల్' 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

ఈ వారం ఈ సినిమా గదర్ 2 క‌లెక్ష‌న్‌ల‌ను దాట‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఆగస్ట్‌లో విడుదలైన సన్నీ డియోల్ చిత్రం గదర్ 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.691.08 కోట్ల బిజినెస్ చేసింది. ప‌ఠాన్ 1050 కోట్లు, జ‌వాన్ 1140 కోట్లు వ‌సూల్ చేశాయి. అయితే షారూక్ రెండు సినిమాల క‌లెక్ష‌న్‌ల‌ రికార్డులు యానిమ‌ల్ బ‌ద్ధ‌లు కొడుతుందా లేదా అని అభిమానులు ఆతృత‌గా చూస్తున్నారు.

భారత్‌లో యానిమల్‌ బిజినెస్ చూస్తే దేశీయ బాక్సాఫీస్ వద్ద 63 కోట్ల రూపాయలతో తొలిరోజు ప్రారంభమైంది. తొలి వారాంతంలోనే ఈ సినిమా రూ.201 కోట్లు రాబట్టింది. ఆదివారం వరకూ ఈ సినిమా మొత్తం 397 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమా వసూళ్లలో శనివారం బంపర్ జంప్ అయింది. రెండో శనివారం ఈ సినిమా రూ.35 కోట్లు రాబట్టింది.

Next Story