యువ‌న‌టుడు ఆక‌స్మిక మృతి..

Angamaly Diaries actor Sarath Chandran passes away at 37. కేరళకు చెందిన యువ నటుడు శరత్ చంద్రన్ (37) శుక్రవారం కన్నుమూశారు.

By Medi Samrat
Published on : 30 July 2022 4:25 PM IST

యువ‌న‌టుడు ఆక‌స్మిక మృతి..

కేరళకు చెందిన యువ నటుడు శరత్ చంద్రన్ (37) శుక్రవారం కన్నుమూశారు. అంగమలీ డైరీస్, కూడే, ఒరు మెక్సికన్ అపరత మొదలైన చిత్రాలలో న‌టించి శరత్ చంద్రన్ పేరు సంపాదించారు. అంగమలీ డైరీస్ లో శరత్ చంద్రన్ తో పాటు న‌టించిన‌ ఆంటోని వర్గీస్ ఆయ‌న‌ మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. శరత్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

శరత్ చంద్రన్ అనేస్య సినిమాతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇండ‌స్ట్రీకి రాక‌ముందు శ‌ర‌త్‌ ఒక ఐటి సంస్థలో పనిచేశారు. అదే సమయంలో సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప‌నిచేశాడు. ఆంటోనీ వర్గీస్, అన్నా రాజన్, కిచ్చు టెల్లస్, ఉల్లాస్ జోస్ చెంబన్, వినీత్ విశ్వం, బిట్టో డేవిస్, టిటో విల్సన్, అంగమలీ డైరీస్ లో న‌టించి మంచి పేరు సంపాదించారు. అంగమాలి డైరీస్‌ చిత్రం తెలుగులో ఫలక్‌నుమా దాస్‌గా రీమేక్ చేయబడింది.









Next Story