క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసిన యాంకర్ రవి

ఓ టీవీ షోలో బావ గారూ బాగున్నారా సినిమాలోని ఓ సీన్ ను యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ టీమ్ రీ-క్రియేట్ చేయడం వివాద్పాదం అయింది.

By Medi Samrat
Published on : 11 April 2025 7:06 PM IST

క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసిన యాంకర్ రవి

ఓ టీవీ షోలో బావ గారూ బాగున్నారా సినిమాలోని ఓ సీన్ ను యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ టీమ్ రీ-క్రియేట్ చేయడం వివాద్పాదం అయింది. నందీశ్వరుడి కొమ్ముల్లోంచి చూస్తే, దేవుడికి బదులు అమ్మాయి కనిపించడం అనే కాన్సెప్ట్ తో ఈ స్కిట్ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

యాంకర్ రవి క్షమాపణలు చెబుతూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల తాను, కొందరు ఆర్టిస్టులు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ అనే కార్యక్రమం చేశామని, ఇందులో తాము ఒక స్పూఫ్ చేశామన్నారు రవి. ఎవరినో బాధపెట్టాలనే ఉద్దేశంతో కావాలని చేసింది కాదని, హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన్నది మా ఉద్దేశం కానే కాదన్నారు. ఇది ఒక సినిమా స్పూఫ్, ఒక సినిమాలోని సీన్ ను మేం స్టేజిపై ప్రదర్శించామంతే అని అన్నారు. దీని వల్ల చాలామంది హిందువులు బాధపడ్డారని తెలిసిందని, అలా చేయడం తప్పు అని చాలా కాల్స్ వస్తున్నాయన్నారు. ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడతామని, జై శ్రీరామ్, జై హింద్ అంటూ యాంకర్ రవి వీడియోను విడుదల చేశారు.

Next Story