యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. రష్మీ గౌతమ్ గ్రాండ్ మదర్(అమ్మమ్మ) కన్నుమూసింది. ఆమెతో తనకున్న అనుబంధాన్ని రష్మీ గుర్తు చేసుకుంటూ బావోద్వేగానికి లోనైంది.
"ఈ రోజు మా గ్రాండ్ మదర్ ప్రవీలా మిశ్రా మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. మా హృదయాలు బాధతో బరువెక్కాయి. మా కుటుంబ సభ్యులందరూ చివరి వీడ్కోలు పలికాము. మా అమ్మమ్మ చాలా ధైర్యవంతురాలు. మాపై ఆమె ప్రభావం చాలానే ఉంది. ఆమె జ్క్షాపకాలు మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఓ శాంతి" అంటూ రష్మీ పోస్ట్ చేసింది.
సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయిన రష్మీ గౌతమ్ జబర్దస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.